1997 చిత్రం పై శ్రీకాంత్ అయ్యంగార్ కీలక వ్యాఖ్యలు

1997 చిత్రం పై శ్రీకాంత్ అయ్యంగార్ కీలక వ్యాఖ్యలు

Published on Nov 22, 2021 4:00 PM IST

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం 1997. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 26న గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఈ సినిమాలో అవినీతి పోలీస్ అధికారిగా భిన్నమైన పాత్రలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఈ సినిమా ముఖ్యంగా తక్కువ కులం మనుషులను ఇంకో కులం వాళ్ళు తొక్కేయాలని, లేదా నీ రంగు తక్కువ, నీ దేవుడు కంటే నా దేవుడు గొప్ప అంటూ మనుషులు మనుషులుగా కాకుండా ప్రవర్తిస్తున్నారు. తక్కువ కులం వారిని తొక్కేయాలి, కానీ అదే తక్కువ కులంలో అమ్మాయి అయితే ఆమె పై మొహం కలుగుతుంది. ప్రస్తుతం మన సిస్టం బాగాలేదు. సిస్టం లో క్రైం రేట్ ఎక్కువగా ఉంది. ఒక అమ్మాయిని రేప్ చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టడం ఇలాంటి అంశాల నేపథ్యంలో సినిమా ఉంటుంది. మన సిస్టం లో ఎలాంటి లోపాలు ఉన్నాయి. సామాన్య మనుషులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటుంది.

ఇందులో నేను కరెప్టెడ్ పోలీస్ అధికారిగా కనిపిస్తాను. నిజంగా ఒక నీచ, దారిద్ర, నికృష్ట పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తాను. నిజంగా ఈ పాత్ర నాకు బిన్నంగా ఉన్నప్పటికీ ఆ పాత్ర తాలూకు ప్రవర్తన చూసి నాకే అసహ్యం వేసింది. అంత నీచమైన పాత్ర. అవతలివాడిని ఎలా తొక్కాలి, నాదే పైచేయి అనాలి అన్న పాయింట్ తో రియల్ గా జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా లో డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎదో పంచ్ డైలాగ్ వెయ్యాలి అన్న ఆలోచనతో కాదు నాచురల్ గా డైలాగ్స్ ఉంటాయి. దాంట్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. నవీన్ చంద్ర పాత్ర చాలా బాగుంటుంది. నవీన్ చంద్ర మంచి ఆర్టిస్ట్.

ఈ రోజుల్లో మారమంటే ఎవరు మారతారు చెప్పండి. ఒక సినిమా విడుదలైతే ప్రతి ఒక్కరు సినిమా ఇలా ఉంది, కెమెరా ఇలా ఉంది, ఫ్రేమ్ ఇలా ఉందంటూ విమర్శిస్తుంటారు. కానీ వాళ్లకు ఇందులో ఏవి తెలియదు, కెమెరా గురించి అసలు తెలియదు, డైరెక్షన్ రాదు కానీ అన్ని తెలుసన్నట్టుగా మాట్లాడేస్తుంటారు. అలాగే ఈ సినిమాలో ప్రస్తుతం జరుగుతున్న సమస్యల గురించి చెప్పే ప్రయత్నం చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు