వారణాసిలో ఫైట్స్ చేయనున్న యంగ్ హీరో !
Published on Sep 20, 2017 3:40 pm IST


ఇటీవలే ‘జయ జానకి నాయక’ సినిమాతో కెరీర్లోనేపెద్ద హిట్ అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రెట్టించిన ఉత్సాహంతో తన రెండవ సినిమా షూటింగ్ ను కూడా జోరుగా కొనసాగిస్తున్నాడు. ఇటీవలే పొల్లాచ్చిలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం వారణాసిలో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టింది.

ఈ షెడ్యూల్లో కూడా భారీ యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా సగం వరకు పూర్తికానుంది. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా జగపతిబాబు, వెన్నెల కిశోర్, శరత్ కుమార్, మీనాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్నారు.

 
Like us on Facebook