వెంకటేష్ సినిమాలో శ్రియ చెయ్యట్లేదా ?


తేజ దర్శకత్వంలో వెంకటేష్ నటించబోయే సినిమాలో శ్రియ నటిస్తానని ముందుకు రావడం జరిగింది. కాని ఈ హీరోయిన్ పెళ్లి తరువాత సినిమాలు చెయ్యడం మానేయ్యలనుకోవడంతో చిత్ర యూనిట్ మరో హీరోయిన్ ను సెలెక్ట్ చెయ్యబోతున్నారు. త్వరలో ఆ వివరాలు తెలియబోతున్నాయి. వచ్చే వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది.

సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ సినిమాకు అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా లక్ష్మి భూపాల మాటలు రాస్తున్నారు. నారా రోహిత్ ఈ మూవీలో మరో హీరోగా కనిపించబోతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించబడుతున్న ఈసినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. వెంకటేష్ ఈ సినిమాలో ప్రొఫెసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.