‘బాహుబలి-2’ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన ‘రాజమౌళి’ !

4th, August 2016 - 11:25:03 AM

SS-RAJAMOULI
దర్శక ధీరుడు ‘ఎస్ ఎస్ రాజమౌళి’ బాహుబలి – ది కన్ క్లూజన్ చిత్రం షూటింగ్ పనుల్లో ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్నారు. వీలైనంత వరకూ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇంత బిజీలో సైతం ఆయన పరిశ్రమలో విడుదలవుతున్న కొత్త చిత్రాల పై దృష్టి పెడుతున్నారు. కొద్దిరోజుల క్రితమే విడుదలైన ‘పెళ్లి చూపులు’ చిత్రం చూసి చాలా బాగుంది, కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా అని కితాబిచ్చారు. ఈ కాంప్లిమెంట్ తో పెళ్లి చూపులు చిత్రానికి కాస్త బూస్ట్ దొరికినట్లయింది.

మళ్ళీ జక్కన్న రేపు విడుదల కానున్న ‘మోహన్ లాల్’ చిత్రమైన ‘మనమంతా’ ను కూడా చూడాలని ‘బాహుబలి’ షూటింగ్ కి సెలవు ప్రకటించేశాడట. ఆయనతో పాటు బాహుబలి టీమ్ కూడా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రీమియర్ షోల ద్వారా తిలకించనున్నారు. సూపర్ స్టార్ ‘మొహన్ లాల్’ నటించిన చిత్రం కావడం చేత ఈ చిత్రంపై దర్శక ధీరుడు అంత ఆసక్తి చూపిస్తున్నాడు. ఇకపోతే ఈ చిత్రాన్ని ‘వారాహి చలం చిత్రం’ సమర్పణలో ‘చంద్రశేఖర్ ఏలేటి’ తెరకెక్కించారు.