మహేష్ నెక్స్ట్ మూవీ నైజాం రైట్స్ భారీ ధరకు?

Published on Jan 30, 2023 3:02 pm IST


సూపర్‌స్టార్ మహేష్ బాబు మరియు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు చాలా ఏళ్ళ తర్వాత కలిసి సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా SSMB 28 అని పేరు పెట్టారు. ఈ బిగ్గీలో పూజా హెగ్డే మరియు శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ను ఆగస్టు 11, 2023న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను నైజాం ప్రాంతానికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు భారీ మొత్తం కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 50 కోట్ల రూపాయలకు ఈ రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి దిల్ రాజు లేదా టీమ్ SSMB 28 అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ బిగ్గీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :