ఆడియో వేడుకకు సిద్దమైన ‘కృష్ణార్జున యుద్ధం’ !

యంగ్ హీరో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఇందులో నాని చిత్తూరుకు చెందిన పల్లెటూరి యువకుడిగా, విదేశాల్లో నుండి వచ్చిన రాక్ స్టార్ గా కనిపించనున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలకానుంది. టీజర్, పాటలు బాగుండటం, నాని వరుస విజయాల మీద ఉండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్ర్రం యొక్క ఆడియో వేడుకను తిరుపతిలో మార్చి 31వ తేదీన భారీ ఎత్తున నిర్వహించనున్నారు. అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తుండగా ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హిపాప్ తమిజా స్వరాలు అందించారు.