ఎన్టీఆర్ తో పని చేసే అవకాశాన్ని వదులుకున్న స్టార్ యాంకర్ !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ బిగ్ బాస్ షోని తెలుగులో చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభంకానున్న ఈ షోకి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. షో నిర్వాహకులు కంటెస్టెంట్లను ఎంచుకునే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ముందుగా స్టార్ యాంకర్ సుమను సంప్రదించగా తనకున్న బిజీ షెడ్యూల్ వలన పైగా ఆ షోకి ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వాల్సి ఉండటం వలన తాను షోలో పాల్గొనలేనని ఆమె తెలిపారు.

దాంతో మరొక స్టార్ యాంకర్ అనసూయను సంప్రదించారు నిర్వాహకులు. కానీ ఆమె కూడా ఇటు టీవీ షోలు, సినిమా ఈవెంట్లతో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటిస్తుండటం వలన ఎక్కువ రోజులు డేట్స్ సర్దలేక ఎన్టీఆర్ తో కలిసి పనిచేసే అవకాశాన్ని అయిష్టంగానే వదులుకున్నారట. మరి బిగ్ బాస్ షో నెక్స్ట్ చాయిస్ ఎవరో చూడాలి. త్వరలోనే ఈ షో తాలూకు షూటింగ్ ముంబైలో మొదలుకానుంది.