హోమ్లీ హీరోయిన్ కి ఆడపిల్ల పుట్టింది !

Published on Jan 24, 2020 7:30 pm IST

ప్రముఖ నటి ఒకప్పటి హోమ్లీ హీరోయిన్ స్నేహ మరోసారి తల్లయ్యారు. ఈ రోజున ఆమె పాపకు జన్మనిచ్చారు. కాగా ఈ విషయాన్ని స్నేహ భర్త ప్రముఖ తమిళ్ యాక్టర్ ప్రసన్న సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తల్లి బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఇక స్నేహ దంపతులకు కోలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులతో పాటు మిగిలిన ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా ఇంతకుముందు స్నేహ దంపతలకు విహాన్‌ అనే మగబిడ్డ ఉన్నారు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది. తమ ఇంటికి లక్ష్మిదేవి వచ్చిందని స్నేహ కుటుంబ సభ్యులు తెగ సంబర పడుతున్నారట. ఇక ప్రసన్న – స్నేహ 2012లో ప్రేమ విహహం చేసుకున్నారు. పెళ్ళయాక కూడా స్నేహ పలు చిత్రాల్లో నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

More