ఉయ్యాలవాడ మోషన్ పోస్టర్ ఓ రేంజ్ లో ఉంటుందట..!


మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 151 వ చిత్రం రోజు రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిరంజీవి గతంలో ఎన్నడూ ఇలాంటి పాత్ర చేయకపోవడంతో అభిమానుల్లో ఈ చిత్రం క్యూరియాసిటీ పెరుగుతోంది.

ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. చిరంజీవి పుట్టిన రోజు వేడుక సందర్భంగా ఆగష్టు 22 న ఈచిత్ర మోషన్ పోస్టర్ ని విడుదల చేయనున్నట్లు తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర మోషన్ పోస్టర్ ని దర్శక ధీరుడు రాజమౌళి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఈవెంట్ లాగా నిర్వహించనున్నారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్ మునుపెన్నడూలేని విధంగా, అభిమానులకు పండగ తేనుందని చిత్ర నిర్మాత రామ్ చరణ్ తెలిపాడు. స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. నయనతార హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.