ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఖరారు !
Published on Feb 19, 2018 4:30 pm IST

త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయం పై ఇన్నాళ్లు రకరకాల పేర్లు వినిపించాయి. కానీ చివరికి పూజా హెగ్డేని ఖరారు చేశారు చిత్ర యూనిట్. త్వరలో ఈ హీరోయిన్ పేరు అధికారికంగా ప్రకటించబోతున్నారు. డీజే సినిమా తరువాత పూజ హెగ్డే ‘సాక్ష్యం’ సినిమాలో నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. మార్చి రెండో వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు పిసి.వినోద్ సినిమాటోగ్రఫర్ గా పనిచెయ్యనున్నారు. ‘జై లవకుశ’ సినిమా తరువాత ఎన్టీఆర్ లుక్ మార్చుకొని చేస్తున్న సినిమా ఇదే. ముందుగా ఈ సినిమా కోసం అనిరుద్ ని అనుకున్నా చివరికి తమన్ ను ఫైనల్ చేశారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతోంది.

 
Like us on Facebook