మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్ రోల్ అదే !

Published on Feb 26, 2020 2:41 pm IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘చిరు 152వ’ సినిమాలో అతిధి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మహేష్ బాబు షూట్ లో పాల్గొనే డేట్స్ కూడా త్వరలో తెలియనున్నాయి. అయితే ఈ చిత్రంలో మహేష్ పాత్ర గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. మహేష్ రోల్ సినిమాలో స్టూడెంట్ లీడర్ అని, దాదాపు ఇరవై నిముషాల పాటు మహేష్ సినిమాలో కనిపిస్తారని.. అందులో పదిహేను నిముషాల పాటు మెగాస్టార్ తో కాంబినేషన్ సీన్స్ ఉంటాయట. అలాగే ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోందట. అయితే ఈ వార్త అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ, ఇది నిజమేనని చిత్రబృందానికి సంబధించిన దగ్గర వ్యక్తుల ద్వారా తెలుస్తోంది.

ఇక మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారట. ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి ట్యూన్లను కూడా సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక మాస్ సాంగ్ ఉందట, ఆ సాంగ్ మాస్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉంటుందట. ఈ సినిమాను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలివేషన్స్ తో కూడుకునే బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది.

సంబంధిత సమాచారం :

X
More