వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్దమైన స్టార్ హీరోయిన్ లేటెస్ట్ మూవీ

Published on Feb 21, 2023 2:17 am IST


తెలుగు సినిమా పరిశ్రమకి తొలిసారిగా నీమనసు నాకు తెలుసు మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు త్రిష. ఆ తరువాత తన అందం, టాలెంట్ తో ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకున్న త్రిష, ఆపైన ఎన్నో సక్సెస్ లు సొంతం చేసుకుని ఇక్కడి ఆడియన్స్ నుండి కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అటు తమిళ్ లో కూడా త్రిష కి సూపర్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఒకింత సెలక్టీవ్ గా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు త్రిష.

అయితే విషయం ఏమిటంటే, తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన రాంగి మూవీ ఇటీవల రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది. ఇక అటు నెట్ ఫ్లిక్స్ ఓటిటి లో సైతం ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ మూవీ తమిళ వర్షన్ ఫిబ్రవరి 26 న సన్ టివి లో మధ్యాహ్నం 3 గం. లకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది. ఎం శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి కథని ఏఆర్ మురుగదాస్ అందించగా దీనిని లైకా ప్రొడక్షన్స్ వారు ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. మరి ఈ మూవీ టెలివిజన్ ఆడియన్స్ ని ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :