తనపై వస్తున్న రూమర్లను కొట్టి పడేసిన స్టార్ హీరోయిన్ !
Published on Apr 11, 2017 3:14 pm IST


ఒకప్పటి బాలీవుడ్ నటి, షారుక్ చిత్రం ‘మోహబత్తిన్’ చిత్రంతో స్టార్ స్టేటస్ తెచ్చుకుని తెలుగులో కూడా ‘ఖడ్గం, మగధీర’ వంటి సినిమాల్లో మెరిసిన కిమ్ శర్మ ప్రస్తుతం బాలీవుడ్ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఆమె తన భర్త, కెన్యాకు చెందిన బడా వ్యాపారవేత్త అయిన అలీ పంజానితో విడిపోయిందని, విడిపోయినందుకుగాను ఆమెకు ఎలాంటి భరణం దక్కలేదని, దీంతో ఆమె దిక్కు తోచని స్థితిలో పడ్డారని రకరకాల వార్తలొచ్చాయి.

ఒకానొక దశలో అలీ పంజాని వేరొకరిని ప్రేమించడం వలనే కిమ్ శర్మ నుండి విడిపోయారని, దీంతో కిమ్ శర్మ తిరిగి ముంబై చేరుకుని జీవితంలో స్థిరపడడానికి ఏదైనా వ్యాపారం మొదలుపెట్టే పనిలో ఉందని అన్నారు. ఈ వార్తలను గమనించిన కిమ్ శర్మ నిన్న తన ట్విట్టర్ ద్వారా కాస్త వెటకారంగా స్పందిస్తూ వీటిలో ఎలాంటి నిజం లేదని, అత్యుత్సాహంతో కొందరు ఇలాంటి రూమార్లను పుట్టిస్తున్నారని అన్నారు.

 
Like us on Facebook