వెంకీ, చైతుల సినిమాకు ముహూర్తం కుదిరింది ?

వెంకీ, చైతుల సినిమాకు ముహూర్తం కుదిరింది ?

Published on Jul 3, 2018 5:17 PM IST

venky naga chaitanya

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ‘జై లవ కుశ’ ఫేమ్ బాబీ డైరెక్ట్ చేయనున్నారు. ఇంతకూ ముందు ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకీ, చైతూలు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తుండం అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాను జూలై 11న లాంచ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడని నేపథ్యంలో టీమ్ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి. కొన వెంకట్, సురేష్ బాబు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా ఈ మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో వెంకీ జోడీగా హ్యూమా ఖురేషి, చైతూ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తారనే టాక్ కూడ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు