ఈ లాక్ డౌన్ రోజుల్ని ప్రచారానికి వాడుకుంటే మంచిది

Published on Mar 30, 2020 8:20 am IST

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం లాక్ డౌన్లో ఉంది. ఎక్కడా ఎలాంటి పనులు, కార్యక్రమాలు జరగడం లేదు. హీరోలు, హీరోయిన్లు అందరూ ఖాళీగానే ఉన్నారు. జనం సైతం ఎక్కువ సమయాన్ని టీవీలు, సోషల్ మీడియా మీదే గడుపుతున్నారు. కాబట్టి డిజిటల్ ప్రమోషన్లకు ఇదే సరైన సమయం. ఇప్పటికే లాక్ డౌన్ మూలంగా కొన్ని సినిమాలు వాయిదాపడ్డాయి. వాటిలో నాని, సుధీర్ బాబుల ‘వి’, అనుష్క ‘నిశ్శబ్దం’, రానా ‘అరణ్య’ చిత్రాలున్నాయి.

అలాగే ‘ఉప్పెన, ఒరేయ్ బుజ్జిగా, రెడ్, మిస్ ఇండియా’ లాంటి చిత్రాలు ఏప్రిల్ నెలలోనే విడుదలకానున్నాయి. కాబట్టి ఈ సినిమాలకు సంభందించిన ప్రమోషన్లు ఈ సెలవు రోజుల్లో చేస్తే జనాలకు ఎక్కువగా రీచ్ అయ్యే వీలుంది. ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ తరహాలోనే కొత్త అప్డేట్స్ ఇస్తూ, నటీనటులు సైతం సోషల్ మీడియా ద్వారా చిత్రం గురించి ప్రేక్షకుల్ని అలర్ట్ చేస్తూ ఉంటే సెలవులు ముగిసి రిలీజ్ డేట్ వచ్చేనాటికి సినిమాకు మంచి ప్రచారం లభిస్తుంది. అలాగే సినీ ప్రియులకు సైతం కొత్త సినిమాలు లేకపోయినా కొత్త అప్డేట్స్ ఆహ్లాదాన్నిస్తాయి.

సంబంధిత సమాచారం :

X
More