ఇస్మార్ట్ శంకర్ వసూళ్ల పరంపర కొనసాగుతూనే ఉంది.

Published on Jul 23, 2019 12:42 pm IST

“ఇస్మార్ట్ శంకర్” చిత్ర వసూళ్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మాస్ ఏరియాలలో ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని సమాచారం. వీకెండ్ లో వసూళ్ల వర్షం కురిపించిన ఇస్మార్ట్ శంకర్ వర్కింగ్ డే అయిన సోమవారం కూడా చుప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. సోమవారం ఏపీ, తెలంగాణాలలో కలిపి ఈ చిత్రం 2.2 కోట్ల షేర్ రాబట్టింది.దీంతో కేవలం తెలుగు రాష్ట్రాలలో ఇస్మార్ట్ శంకర్ 22 కోట్ల షేర్ సాధించినట్లైంది. ఐతే ఈనెల 26న విజయ్ దేవరకొండ నటించిన “డియర్ కామ్రేడ్” మూవీ విడుదల కానుండటంతో శుక్రవారం “ఇస్మార్ట్ శంకర్” వసూళ్లకు బ్రేక్ పడే అవకాశం కలదు. ఇంకా ఆ మూవీ థియేటర్లలోకి రావడానికి మూడు రోజుల గడువు ఉండటంతో ఈ వ్యవధిలో ఇంకొంత మెరుగైన వసూళ్లు “ఇస్మార్ట్ శంకర్” దక్కించుకునే అవకాశం కలదు.

పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్,నిధి అగర్వాల్,నభా నటేష్ ప్రధాన హీరో హీరోయిన్లుగా నటించగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం :