‘కాలా’ ఓకే.. మరి ‘2.0’ సంగతేంటి !
Published on Feb 12, 2018 4:23 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న రెండు భారీ చిత్రాలు ‘2 పాయింట్ 0, కాలా’. ఈ రెండు సినిమాల విడుదల్ తేదీలపై గత కొన్ని నెలలుగా రకరకాల చర్చలు జరుగుతూ వచ్చాయి. ఎట్టకేలకు పా.రంజిత్ తెరకెకెక్కించిన ‘కాలా’ సినిమా ఏప్రిల్ 27న రిలీజవుతుందని అధికారికంగా క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. కానీ మరొక సినిమా శంకర్ యొక్క ‘2 పాయింట్’ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

కొన్ని నెలల క్రితమే సినిమాను ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తామని అన్నారు. ఆ తరవాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉందని వేసవికి వాయిదావేశారు. మళ్ళీ ఇప్పుడు చిత్రం రిలీజైతే ఆగష్టు నెలలో అవ్వొచ్చని లేకపోతే మరోసారి వాయిదాపడొచ్చనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నాయి. కాబట్టి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఖచ్చితమైన విడుదల ఎప్పుడో ప్రకటిస్తే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఒక క్లారిటీ ఉంటుంది.

 
Like us on Facebook