నార్త్ లో “ఇండియన్ 2” కి గట్టి పోటీ?

నార్త్ లో “ఇండియన్ 2” కి గట్టి పోటీ?

Published on Apr 16, 2024 12:11 PM IST


లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ అలాగే సిద్ధార్థ్ తదితరులు ముఖ్య పాత్రల్లో మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “ఇండియన్ 2” (Indian 2). మరి తెలుగులో “భారతీయుడు 2” గా హిందీలో “హిందుస్తానీ 2” గా ఈ జూన్ లో రిలీజ్ కి రాబోతుంది. అయితే ఇంకా ఎలాంటి డేట్ ఈ సినిమాకి లాక్ కాలేదు కానీ లేటెస్ట్ బజ్ గా జూన్ 14 అంటూ ఓ డేట్ గట్టిగా ప్రచారం అవుతుంది.

అయితే ఈ డేట్ లో మాత్రం బాలీవుడ్ సినిమా దగ్గర గట్టి పోటీ ఈ సినిమాకి తప్పదు అని తెలుస్తుంది. మరి బాలీవుడ్ నుంచి అదే డేట్ లో కంగనా రనౌత్ నటిస్తున్న అవైటెడ్ సినిమా “ఎమెర్జెన్సీ” అలాగే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న చిత్రం “చందు ఛాంపియన్” కూడా ఉంది. దీనితో నార్త్ లో మాత్రం ఇండియన్ 2 కి గట్టి పోటీ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇంకా ఇండియన్ 2 కి జూన్ 13 కూడా వినిపిస్తుంది. మరి చూడాలి మేకర్స్ అఫీషియల్ ఏ డేట్ ని అనౌన్స్ చేస్తారో అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు