అభిమానులను సంతోషంలో ముంచెత్తిన ‘డీజే’ ఫస్ట్ లుక్ !
Published on Feb 18, 2017 9:33 am IST


స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఆచారి పాత్రలో నటిస్తున్నాడంటూ ఎంతో ఆసక్తిని రేపిన డీజే (దువ్వాడ జగన్నాథం) ఫస్ట్ లుక్ అభిమానులను అలరించేలా ఉంది. ఆచారి పాత్రలో బన్నీ సరికొత్తగా కనిపిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొద్ది సేపటి క్రితమే ఫస్ట్ లుక్ విడుదల కాగా సోషల్ మీడియాలో ట్రేండింగ్ టాపిక్ గా మారిపోయింది.విభూది నామాలతో స్కూటర్ పై కూరగాయలను తీసుకొస్తున్న బన్నీ లుక్ బావుంది. కాగా ఈ చిత్రం ఇప్పటికే ఎక్కువ భాగం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. మార్చి కల్లా మిగిలిన భాగాన్ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 
Like us on Facebook