‘ఆర్ఆర్ఆర్’ సాంగ్ పై సుద్దాల అశోక్‌తేజ వివరణ

Published on Dec 27, 2021 10:00 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. విజువల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రానున్న ఈ భారీ చిత్రం పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక, గిరిజనోద్యమ నాయకుడు, గోండు బొబ్బిలి కొమురం భీమ్ పై “కొమురం భీముడో..కొమురం భీముడో…, అర్రాసు నెబుడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో…” అంటూ రిలీజ్ చేసిన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

కాగా ఈ పాటను రాసిన సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విశేషాలు చెప్పారు. ‘కొమురం భీమ్‌ ని ఆంగ్లేయులు చిత్రహింసలు పెడుతున్న సమయంలో తనకి తానే ధైర్యం చెప్పుకొనే సందర్భంలో ఈ పాట వస్తుంది. ఈ పాట రాయాలని మొదలు పెట్టినప్పుడు.. కొమురం భీమ్‌ ధైర్యాన్ని, అడవి వీరుల వారసత్వాన్ని, కొమురం భీమ్‌ నేపథ్యాన్ని, భయపడని ధీరోధాత్తమైన ఆయన తెగింపును, జీవితాన్ని పదాల రూపంలో రాసే ప్రయత్నం చేశాను’ అంటూ సుద్దాల అశోక్‌తేజ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :