కొత్త సినిమా ప్రారంభించిన సుదీర్ బాబు !
Published on Nov 23, 2017 3:11 pm IST

హీరో సుదీర్ బాబు చేసిన ‘ప్రేమకథా చిత్రమ్, ఎస్ఎంఎస్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ తరువాత అతను చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా ఈ హీరో నూతన దర్శకుడు రాజశేఖర్ తో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాకు సుదీర్ బాబే నిర్మాత. ఈ ప్రాజెక్ట్ తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుదీర్ బాబు చెయ్యబోతున్న సినిమా ఈరోజు ప్రారంభం అయ్యింది.

‘అష్టా చెమ్మ, గోల్కొండ హై స్కూల్, జంటిల్మెన్’ సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి తాజాగా ‘అమీ తుమీ’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా తరువాత సుదీర్ బాబుతో సినిమా చేస్తోండడం విశేషం. అదితిరావ్ హైదరి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించనున్నాడు.

 
Like us on Facebook