టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హే భగవాన్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గోపీ అచర డైరెక్ట్ చేస్తుండగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి న్యూ ఇయర్ కానుకగా ఓ భారీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా వారు రిలీజ్ చేశారు. సినిమా ప్రారంభమైన దగ్గర్నుంచి సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సీన్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ‘లిటిల్ హార్ట్స్’ ఫేం బ్యూటీ శివాని నాగరం హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో సుహాస్‌తో కలిసి ఆమె ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ అనే సినిమాలో నటించింది.
ఇప్పుడు రెండోసారి సుహాస్‌తో ఆమె కలిసి నటిస్తుండటంతో ఈ కాంబో ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బి.నరేందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.


