మరో పవర్ ఫుల్ పాత్రలో సుహాసిని…”బలమెవ్వడు” కి మరింత బలం!

Published on Jul 19, 2021 5:03 pm IST

పలు భాషల్లో దశాబ్దాలుగా నటించి తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు సుహాసిని. అయితే అవకాశం వచ్చిన ప్రతిసారీ తన నటన తో ఆకట్టుకుంటున్న సుహాసిని ఇప్పుడు మరొకసారి బలమెవ్వడు చిత్రం లో మరొక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో డాక్టర్ యశోద పాత్రలో నటిస్తున్నారు. మెడికల్ మాఫియా కి వ్యతిరేకంగా పోరాడే నిజాయితీ గల వైద్యురాలి పాత్ర లో సుహాసిని అధ్బుతంగా ఉండబోతుంది అని తెలుస్తోంది.

అయితే ధృవన్ కటకం, నియా త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ చిత్రం లో వైద్య రంగం లోని దోపిడీ ను ప్రశ్నించనుంది.అయితే ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్బీ మార్కండేయులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :