ఒక్క యాక్షన్‌ ఎపిసోడ్‌ కే 70 కోట్లు !

Published on Aug 25, 2019 12:20 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న చిత్రం ‘సాహో’. కాగా అగ‌ష్టు 30న ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్‌ ను నిర్వహిస్తోంది. అయితే ‘సాహో’ ప్రీ క్లైమాక్స్‌ బడ్జెట్‌ గురించి సుజిత్ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. సుజిత్ మాట్లాడుతూ.. సినిమాలో ప్రీ క్లైమాక్స్‌లో 12 నిమిషాల యాక్షన్‌ ఎపిసోడ్‌ ఉంది. దానికి రూ.70 కోట్లు ఖర్చు పెట్టాం. హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ కిన్నీ బేట్స్‌ ఆధ్వర్యంలో ఆ ఎపిసోడ్‌ చిత్రీకరించాం అని సుజిత్ తెలిపాడు.

కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్, అరుణ్ విజయ్, మందిరా బేడీ, మురళి శర్మ, వెన్నెల కిషోర్ ఇతర కీలకపాత్రలుగా చేస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :