ప్రభాస్ పై ‘సాహో’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు.

Published on Aug 3, 2019 3:00 am IST

సాహో థియేటర్లలో సందడి చేయడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలివుంది. దీనిలో సాహో యూనిట్ ప్రచారం పై ద్రుష్టి సారించాయి. ఇందులో భాగంగా మూవీ సాంగ్స్, పోస్టర్ విడుదల చేస్తూ చిత్రానికి హైప్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో చిత్రానికి అదేస్థాయిలో వసూళ్లు రావాలంటే ప్రొమోషన్స్ అనేవి చాలా అవసరం. నేడు ఈ చిత్ర దర్శకుడు సుజీత్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా చిత్ర విశేషాలు పంచుకున్న సుజీత్ , ఈ మూవీకి ప్రభాస్ నే ఎందుకు ఎంచుకున్నారు అని ఒకరు అడుగగా, ఆయన ఆసక్తికరంగా ప్రభాస్ ని ఎవరు సెలెక్ట్ చేసుకోలేరు.ఆయనే డైరెక్టర్ అయిన నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నేను చెప్పిన కథ నచ్చడం వల్లే నన్ను డైరెక్టర్ గా ఒప్పుకున్నారనుకుంటున్నాను అన్నారు.ఆయనపైన ఉన్న ఇష్టంతోనే ఆయనకు తగ్గట్టుగా కథను సిద్ధం చేశాను. ఒక డైరెక్టర్ గా ఈ చిత్రం కొరకు అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది. సినిమాకు సంబంధించి ప్రతి విషయంలో చాల జాగ్రత్తలు తీసుకొని తెరకెక్కించడం జరిగింది అని అన్నారు.

సంబంధిత సమాచారం :