“శుక్ర” కొత్తగా ఉంటుంది.. ఈ నెల 23న విడుదల !

“శుక్ర” కొత్తగా ఉంటుంది.. ఈ నెల 23న విడుదల !

Published on Apr 19, 2021 8:00 PM IST

మైండ్ గేమ్ నేపథ్యంలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించిన సినిమా‌ “శుక్ర”. సుకు పూర్వజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శుక్ర సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుకు పూర్వజ్ సినిమా విశేషాలు తెలిపారు. దర్శకుడు సుకు పూర్వజ్ మాట్లాడుతూ…ఆంధ్ర యూనివర్సిటీలో రంగస్థలం అనే నాటికకు బెస్ట్ ప్రైజ్ వచ్చింది. గోల్డ్ మెడల్ తీసుకున్నాను. నాటికలు, నాటకాలు ప్రదర్శించేవాళ్లం. శుక్ర అనే పేరుకు సబ్జెక్ట్ కు లింక్ ఉంది. ఆపరేషన్ శుక్ర అనేది సినిమాలో జరుగుతుంది. మైండ్ గేమ్ అనే జానర్ లో సినిమా సాగుతుంది.

ఇండియాలో కొన్ని నగరాలను వణికిస్తున్న ఒక మాఫియా గ్యాంగ్ ఇతివృత్తంగా సినిమా ఉంటుంది. ఒక కపుల్ మాఫియా ప్రభావిత నగరంలో అడుగుపెడతారు. అక్కడ ఆపరేషన్ శుక్ర మొదలువుతుంది.10 పైలెట్, ఇండిపెండెంట్ ఫిలింస్ చేశాను. అందులో కాలజ్ఢానం అనే దానికి న్యూయార్క్, ముంబై ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డ్స్ వచ్చాయి. నేను సాఫ్ట్ వేర్ జాబ్ చేశాను కొన్నాళ్లు. నా మనసుకు నచ్చింది ఇది కాదు అనిపించింది. సినిమాటోగ్రఫీ కోర్స్ చేశాను. అక్కడి నుంచి స్క్రిప్ట్ లు రాశాను. నా దగ్గర పెద్ద లైబ్రరీ ఉంది. అనేక స్క్రిప్ట్ లు బౌండ్ గా చేసి పెట్టాను. కొన్ని స్క్రిప్టులు నావి బయటకొచ్చాయి. ఆ సినిమాలు బాగా ఆడాయి కూడా అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు