ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ‘టెంపర్’ సినిమాతో హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్దమవుతున్నాడు. ఎన్.టి.ఆర్ తన తదుపరి సినిమా సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఏప్రిల్ 17 నుంచి లండన్ లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ఈ సినిమా కోసం తన లుక్ ని మార్చుకునే పనిలో ఉన్నాడు. ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ సినిమాలో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించి, తన లుక్ ని పూర్తిగా మార్చుకున్నాడు.
అలానే ఇప్పుడు సుకుమార్ సినిమా కోసం కూడా సరికొత్త లుక్ ని ట్రై చేస్తున్నాడు. ప్రతి సినిమాలోనూ తన హీరోని డిఫరెంట్ గా చూపే సుకుమార్ ఎన్.టి.ఆర్ కోసం కూడా ఓ డిఫరెంట్ లుక్ ని డిజైన్ చేసాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ఈ సినిమా కోసం తన లుక్ ని మార్చుకునే పనిలో ఉన్నాడని సమాచారం. మరి ఎన్.టి.ఆర్ లుక్ ఎలా ఉంటుందనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్.


