క్రేజీ బజ్ : టాప్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో సుకుమార్ భారీ ప్రాజక్ట్ ?

క్రేజీ బజ్ : టాప్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో సుకుమార్ భారీ ప్రాజక్ట్ ?

Published on Nov 5, 2022 12:00 AM IST


టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ పుష్ప ది రైజ్ మూవీ తో దేశవ్యాప్తయంగా అన్ని భాషల ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక అతి త్వరలో పుష్ప ది రైజ్ సీక్వెల్ అయిన పుష్ప ది రూల్ మూవీ కోసం సిద్ధం అవుతున్నారు సుకుమార్. ఇక ఇటీవల కాశ్మీర్ ఫైల్స్ మూవీతో పెద్ద సక్సెస్ అందుకున్న దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి. తన కెరీర్ లో పలు డిఫరెంట్ మూవీస్ చేసి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు రంజన్.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా పలు సక్సెస్ఫుల్ ప్రాజక్ట్స్ తో దూసుకెళ్తున్నారు బడా ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్. కాగా ఈ ముగ్గురు కూడా నేడు ఒక బడా క్రేజీ ప్రాజక్ట్ కోసం కలిసినట్లు తెలుస్తోంది. వీరు కలిసిన ఫోటోలు నేడు పలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. కాగా వీరి కలయికపై తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ట్వీట్ చేసారు దర్శకుడు వివేక్. అయితే ఈ ముగ్గురి సూపర్ కాంబినేషన్ లో రూపొందనున్న ఆ ప్రాజక్ట్ కి ఎవరు దర్శకత్వం వహిస్తారు, అలానే దాని డీటెయిల్స్ ఏంటి అనేది తెలియాలి అంటే దీనిపై అఫీషియల్ గా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు