‘రెబల్ స్టార్’ వారసుడు సినిమాలకే పరిమితం !

Published on Aug 25, 2019 11:50 am IST

కన్నడ రెబల్ స్టార్ అంబరీష్‌ కుమారుడు అభిషేక్‌ రాజకీయాల్లోకి వస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను ఎవరూ నమ్మవద్దని అంబరీష్ సతీమణి ఎంపీ సుమలత తెలిపారు. శనివారం నాడు అంబరీశ్‌ పుణ్యతిథిని పురస్కరించుకుని యశవంతపురలోని కంఠీరవ స్టూడియోలో అంబరీశ్‌ సమాధికి ఎంపీ సుమలత నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుమలత మీడియాతో మాట్లాడారు. కాగా మీడియా ఆమెను అభిషేక్ రాజకీయ ప్రవేశం గురించి అడగగా అలాంటిదేది లేదని ఆమె స్పష్టం చేశారు.

సుమలత మాట్లాడుతూ.. ‘మద్దూరు నుంచి అభిషేక్‌ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దయచేసి అభిషేక్‌ ను రాజకీయాల్లోకి లాగవద్దని, తను ఇప్పుడు కేవలం సినిమాల పై మాత్రమే దృష్టి పెట్టాడని.. తను రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉందన్నారు. ఇక రెబల్ స్టార్ అంబరీష్‌ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అభిషేక్‌ మరి తండ్రిలాగే కన్నడ నాట సక్సెస్ అవుతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :