షూటింగ్ మొదలుపెట్టిన సుమంత్ !
Published on Nov 29, 2017 9:03 am IST

హీరో సుమంత్ తన కొత్త సినిమా షూటింగ్ ను మొదలుపెట్టేశారు. నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. సోమవారం నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూట్ మొదలైంది. ప్రస్తుతం హీరో సుమంత్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

ఈ చిత్రంలో సుమంత్ పాత్రకు కొంత నెగెటివ్ షేడ్స్ ఉండటమే గాక కథ కూడా చాలా ఆసక్తిగా, కొత్తగా ఉండనుంది. రియాలిటీకి దగ్గరగా ఉంటూ, సరికొత్త బ్యాక్ డ్రాప్లో నడవనున్న ఈ సినిమాతో మలయాళీ నటి అంజు కురియన్ తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇకపోతే సుమంత్ నటించిన ‘మళ్ళీ రావా’ చిత్రం డిసెంబర్ 8న విడుదలకానుంది.

 
Like us on Facebook