ఇంటర్వ్యూ: సందీప్ కిషన్ – సినిమా చూస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉంటారు !

Published on Nov 12, 2019 3:45 pm IST

సందీప్ కిషన్ హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. కాగా ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సికా మోట్వాని హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. ఈ సంధర్భంగా సందీప్ కిషన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం.

 

‘తెనాలి రామకృష్ణ’గా మీ పాత్ర గురించి చెప్పండి ?

 

తెనాలి రామకృష్ణ అనేవాడు కర్నూలులో ఒక తెలివైన లాయర్. తన క్యారెక్టరైజేషన్ పూర్తిగా ఫన్ తో సాగుతుంది. ప్రతి సినిమాలో ఏదోకటి బలంగా ఉంటుంది. అలాగే ఈ సినిమాకి బలం కామెడీ. ఇది పక్కా కామెడీ బేస్డ్ మూవీ. ఈ సినిమా బాగా ఎంజాయ్ చేశాను.

 

మీ పాత్ర పూర్తిగా కామెడీ చుట్టే తిరుగుతుందా ?

 

కేసులను కాంప్రమైజ్ ఐతే ఎలాంటి గొడవలు ఉండవని బలంగా నమ్మే హీరో, చివరకి ఒక కేసు విషయంలో మాత్రం అసలు కాంప్రమైజే వద్దు అనుకుంటాడు. సరదాగా ఉండే తను అంతే స్థాయిలో సీరియస్ గా ఉంటాడు. హీరో పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయి. నా పాత్రలో కేవలం కామెడీనే కాకుండా మిగిలిన ఎమోషన్స్ కూడా ఉంటాయి.

 

మీరు ఒక కథ ఒప్పుకున్న తరువాత ఆ కథలో యాక్ట్ చెయ్యడానికి మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తారు ?

 

ముందుగా కథ నేపథ్యం గురించి పూర్తిగా అర్ధం చేసుకుంటాను. ఆ కథలో నా పాత్ర ఎలాంటిది, ఆ పాత్ర ఏ సీన్ లో ఎలా ప్రవర్తిస్తోంది ? ఎలా మాట్లాడుతుంది ? అలాగే ఆ పాత్ర గెటప్, డిక్షన్ ఇలా ప్రతిదీ నోట్ చేసుకుంటాను. అవన్నీ దృష్టిలో పెట్టుకుని యాక్ట్ చేస్తాను.

 

దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డిగారు ప్రస్తుతం హిట్ ట్రాక్ లో లేరు. ఆయనతోనే ఈ సినిమా చేయడానికి కారణం ?

 

హిట్ ప్లాప్ లతో సంబంధం ఏమిలేదండీ. అయినా ఆయన గత సినిమా ప్లాప్ కావొచ్చు, కానీ, అంతకు ముందు ఆయన వరుసగా నాలుగు హిట్ సినిమాలు ఇచ్చారు. ఆయనతో పని చేయడం చాల హ్యాపీ.

 

ఈ సినిమా అవుట్ ఫుట్ మీకు పూర్తి సంతృప్తిని ఇచ్చిందా ?

 

చాలా. మీరు సినిమా చూస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. మాకు ఈ సినిమా పూర్తి నమ్మకం ఉంది.

 

మీ తదుపరి సినిమాల గురించి ?

 

‘తెనాలి రామకృష్ణ’ రిలీజ్ కోసమే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా తరువాత ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ మూవీ చేస్తున్నాను. ఇక ఆ తరువాత ప్రస్తుతానికైతే ఎలాంటి సినిమా ఒప్పుకోలేదు.

సంబంధిత సమాచారం :

More