మరో ప్రాజెక్ట్ ని లైన్లో పెడుతున్న యంగ్ హీరో
Published on Jun 17, 2017 9:33 am IST


యంగ్ హీరో సందీప్ కిషన్ కు మంచి అవకాశాలు అందుతున్నాయి. ఇప్పటికే కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో సందీప్ కిషన్ నటిస్తున్నాడు. కృష్ణ వంశి దర్శకత్వంలో నటిస్తున్న ‘నక్షత్రం’ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. మరో వైపు సుశీంథిరన్ దర్శకత్వం లో C/O సూర్య , సివి కుమార్ దర్శకత్వంలోని మాయావన్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ సినిమాలు కాక సందీప్ కిషన్ మరో చిత్రాన్ని త్వరలో ప్రారంభించనున్నాడు. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’దర్శకుడు వంశి కృష్ణ దర్శకత్వంలో సందీప్ కిషన్ ఓ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. జూన్ 20 న ఈ చిత్రం లాంచ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని రూపేష్ డి గోహిల్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.

 
Like us on Facebook