ఏప్రిల్ 10న సందీప్ కిషన్ ‘టైగర్’

ఏప్రిల్ 10న సందీప్ కిషన్ ‘టైగర్’

Published on Mar 18, 2015 11:03 AM IST

tiger
సినిమా సినిమాకి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుసగా వైవిధ్యభరిత సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ ‘టైగర్’. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ హీరోలుగా ఏఆర్ మురుగదాస్ శిష్యుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియో ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యింది. ముందుగా ఈ సినిమాని మార్చిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రిలీజ్ కి సరైన స్లాట్ దొరకకపోవడం తో ఈ సినిమాని మార్చి నుంచి ఏప్రిల్ కి మార్చారు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ సినిమాని ఏప్రిల్ 10న రిలీజ్ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ భాగం కాశీ బ్యాక్ డ్రాప్ లో జరగనున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇద్దరు అగ్ర నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు