సెన్సార్ పూర్తిచేసుకున్న సునీల్ సినిమా!


హీరో సునీల్ చేసిన తాజా చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఆయన గత చిత్రాలు రెండు ‘ఈడు గోల్డ్ ఎహె, జక్కన్న’ వంటివి ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు సునీల్. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని కూడా పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీచేసింది.

పూర్తిస్థాయి ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఖచ్చితంగా విజయాన్ని అందిస్తుందని సునీల్ భావిస్తున్నారు. దర్శకుడు క్రాంతి మాధవన్ ఈ సినిమాను తెరకెక్కించగా జిబ్రాన్ సంగీతం అందించారు. కిరీటి, పరుచూరి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మలయాళీ బ్యూటీ మియా జార్జ్ హీరోయిన్ గా మెరవనుండగా ఈ నెల 15న సినిమా విడుదలకానుంది.