‘సాహో’ ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ !
Published on Oct 23, 2017 11:45 am IST


రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’ యొక్క ఫస్ట్ లుక్ ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఈ ఉదయం 9 గంటల 30 నిముషాలకు విడుదలైంది. నిన్న సాయంతరం నుండి ఈ లుక్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ విడుదలైన కొద్దిసేపటికే దాన్ని టాప్ ట్రెండింగ్స్ లో నిలబెట్టారు. ఇక ఫస్ట్ లుక్ కూడా చాలా స్టైలిష్ గా, లావిష్ గా కనిపిస్తుండంతో సినిమా మేకింగ్ స్థాయి గొప్పగా ఉంటుందని ఇట్టే అర్థమవుతోంది.

ఇక ప్రభాస్ స్టైలిష్ గా, సగం ముఖం మాత్రమే కనబడేలా ఓవర్ కోట్ ధరించి ఒంటరిగా నడుస్తున్న స్టిల్ కూడా బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. రాజమౌళి లాంటి ప్రముఖులు, ఇతర స్టార్ హీరోలు అందరూ లుక్ చాలా బాగుందని ప్రసంశలు కురిపిస్తున్నారు. అలాగే అద్భుతమైన సినిమాటోగ్రఫీ వర్క్ చూపించిన సినిమాటోగ్రఫర్ మది కూడా మంచి కాంప్లిమెంట్స్ దక్కుతున్నాయి. యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సుజీత్ డైరెక్ట్ చేస్తున్నారు.

 
Like us on Facebook