ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ కి సూపర్ రెస్పాన్స్!

Published on Feb 26, 2023 10:04 pm IST

ఈ మధ్య క్రైమ్ థ్రిల్లర్‌లకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ జోనర్‌లో చాలా షోలు వచ్చాయి సక్సెస్ అయ్యాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్ జీ5 లో ఈ శుక్రవారం వచ్చిన పులి మేక అటువంటి సిరీస్‌లలో ఒకటి. ప్రస్తుతం పులి మేక తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. లావణ్య త్రిపాఠి మరియు ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ షో హైదరాబాద్‌లో జరిగే పోలీసు అధికారుల వరుస హత్యల చుట్టూ తిరుగుతుంది.

తాజా అప్డేట్ ఏమిటంటే, ఈ షో ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లో బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని జీ5 సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ షోలో బిగ్‌బాస్ ఫేమ్ సిరి హన్మంత్, సుమన్, రాజా చెంబోలు, ముక్కు అవినాష్, సాయి శ్రీనివాస్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ రూపొందించిన ఈ షోకి చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :