సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న “వ్యవస్థ”

Published on May 17, 2023 8:17 pm IST

నటి హెబ్బా పటేల్ ఇటీవల వ్యవస్థ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రస్తుతం జీ 5 లో ప్రసారం అవుతోంది. తాజా వార్త ఏమిటంటే, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో వ్యవస్థ 150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల వ్యూస్ తో దూసుకు పోతుంది. తెలుగు షో జీ5 ఇండియా వెబ్ సిరీస్ విభాగంలో రెండవ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది.

కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం మరియు సంపత్ రాజ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. కామ్నా జెత్మలానీ, సుకృత వాగ్లే, శివాని, సుజిత్ కుమార్, రాజా అశోక్ మరియు గురు రాజ్ సహాయక పాత్రలు పోషించారు. పట్టాబి ఆర్ చిలుకూరి ఈ సిరీస్ ను నిర్మించగా, నరేష్ కుమారన్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు.

సంబంధిత సమాచారం :