రీ రిలీజ్ కి రెడీ అయిన మొట్టమొదటి ఇండియన్ కౌ బాయ్ మూవీ “మోసగాళ్ళకు మోసగాడు”

Published on May 1, 2023 1:00 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ తెగ నడుస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ వంతు వచ్చింది. మే 31, 2023 న కృష్ణ జయంతి సందర్భంగా మొట్ట మొదటి ఇండియన్ కౌ బాయ్ మూవీ అయిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు సినిమాను వరల్డ్ మ్యాప్ పై ఉంచిన ఈ చిత్రం 4కే లో రిలీజ్ కానుంది. ఈ న్యూస్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఆడియెన్స్ సైతం ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :