కరోనా బాధితుల సహాయార్థం మహేష్ బాబు కోటి !

Published on Mar 26, 2020 4:14 pm IST

కరోనా వైరస్ మొత్తం ప్రపంచంలో ఒక రకమైన భయానిక వాతావరణాన్ని సృష్టించింది. ప్రభుత్వాలతో పాటు సినీ ప్రముఖులు కూడా తమవంతుగా ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబు కరోనా వైరస్ బాధితుల సహాయార్థం కొరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూపాయలను విరాళంగా ప్రకటించాడు. ప్రతి వ్యక్తి ఇంట్లోనే ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప ఎవ్వరు బయటికి రావద్దు అని.. అందరూ ప్రభుత్వం చెప్పినట్లుగా 21 రోజుల పాటు సామాజిక దూరం పాటించాలని.. అలాగే అందరూ లాక్ డౌన్ రూల్స్ పాటిద్దామని మహేష్ లెటర్ రిలీజ్ చేసాడు.

మానవత్వం గెలుస్తుంది.. కచ్చితంగా ఈ యుద్ధంలో మనం విజయం సాధిస్తాము మనకు మనమే రక్షణగా ఉండాల్సిన సమయం ఇది అని మహేష్ తెలిపాడు. ఇంకా ఎంతమంది తారలు దేశం కోసం తమ వంతు కృషి చేయడానికి ముందుకు వస్తారో చూడాలి. ఇక కరోనా వైరస్ కారణంగా షూటింగ్ జరుపుకోవాల్సిన పలు సినిమాలు షెడ్యూల్స్ వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More