ఆకట్టుకుంటున్న సూపర్ స్టార్ సినిమా టీజర్ !
Published on Mar 2, 2018 11:39 am IST

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన కాలా సినిమా టీజర్ ఈ రోజు ఉదయం విడుదలైంది. టీజర్ బయటికి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హుమా కురెశి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఈ సినిమాలో రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

ధనుష్ తన స్వంత నిర్మాణ సంస్థ వండర్ బార్స్‌పై ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. రోబో 2 సినిమా తరువాత కాలా విడుదల కావాలి కాని రోబో 2 వర్క్స్ పెండింగ్ ఉండడంతో ఆ సినిమా వాయిదా పడింది. కాలా ఏప్రిల్ 27 న విడుదల కాబోతోంది. టిజర్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

టీజర్ కోసం క్లిక్ చెయ్యండి

 
Like us on Facebook