భారీ నిర్మాణ సంస్థ తో మరో రెండు చిత్రాలకు సైన్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్!

భారీ నిర్మాణ సంస్థ తో మరో రెండు చిత్రాలకు సైన్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్!

Published on Oct 29, 2022 1:35 AM IST


సూపర్‌స్టార్ రజనీకాంత్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల తన చిత్రాలతో రజనీ కాంత్ అభిమానులను నిరాశ పరిచారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న జైలర్ షూటింగ్‌లో ఉన్నారు రజనీ కాంత్. తాజాగా భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో రజనీ రెండు సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది.

ఈ విషయం తో పాటుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజనీతో పాటు లైకా ప్రొడక్షన్స్ చైర్మన్ సుభాస్కరన్ మరియు లైకా అధినేత తమిళ కుమరన్ ఉన్నారు. మరి సూపర్‌స్టార్‌కి దర్శకత్వం వహించే లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి. ఈ సినిమాల్లో ఒకదానికి రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించనుందని కొన్ని పుకార్లు కూడా వచ్చాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, లైకా ప్రొడక్షన్స్ ఇప్పటికే రజనీ తో రోబో 2.0 మరియు దర్బార్‌లను నిర్మించడం జరిగింది. లైకా ప్రొడక్షన్స్ పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ తో దూసుకు పోతుంది. పొన్నియిన్ సెల్వన్ 2 తో పాటుగా ఇండియన్2 చిత్రాలను కూడా ఇది నిర్మిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రెండు చిత్రాలు నవంబర్ 5 వ తేదీన చెన్నై లో పూజా కార్యక్రమాలతో మొదలు కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు