కోదండరామిరెడ్డి కోసం ‘చిరు- బాలయ్య’ ఉత్సాహంగా.. !

కోదండరామిరెడ్డి కోసం ‘చిరు- బాలయ్య’ ఉత్సాహంగా.. !

Published on Jul 2, 2019 11:42 AM IST

ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి 70వ జన్మదిన వేడుకలు సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. కోదండరామిరెడ్డి 1980లో సంధ్య అనే చిత్రంతో తెలుగు చలనచిత్ర రంగానికి దర్శకుడిగా పరిచయమయ్యారు. హిందీ చిత్రం తపస్య ఆధారంగా ఈ సినిమాను తీసారు. ఇక చిరంజీవిని తారాపథానికి తీసుకెళ్ళిన ఖైదీ చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. అలాగే న్యాయం కావాలి చిత్రంతో మొదలైన వీరి సినీ నిర్మాణ బంధం ముఠా మేస్త్రి సినిమా వరకు సాగింది. చిరు – ఎ. కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో 25 సినిమాలు వచ్చాయి. అందులో 80% చిత్రాలు విజయం సాధించడం విశేషం.

కాగా ఈ జన్మదిన వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే విక్టరీ వెంకటేశ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మరియు ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎమ్మెస్ రాజు, అశ్వనీదత్, దిల్‌ రాజు, అనిల్ సుంకర, దర్శకులు బి. గోపాల్, పరుచూరి వెంకటేశ్వరరావు, సత్యానంద్, డాక్టర్ కె.ఎల్. నారాయణ, చంటి అడ్డాల, ఎస్ గోపాల్‌రెడ్డి, సంగీతదర్శకుడు కోటి, కెమెరామెన్ రవీంద్రబాబు, శ్రీమిత్ర చౌదరి, శ్రీనివాస్ రాజు, కోదండరామిరెడ్డి కుమారులు సునీల్, వైభవ్, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు