ఆస్కార్ బరిలో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

ఆస్కార్ బరిలో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

Published on Jan 26, 2021 11:00 PM IST

సూర్య నటించిన తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లాక్ డౌన్ నేపథ్యంలో థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఓటీటీ ద్వారా విడుదలైంది. సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుధా కొంగర టేకింగ్, సూర్య నటన సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాయి. సినిమా చూసిన వారందరినీ భావోద్వేగానికి గురిచేసింది.

ఈ సినిమాతో సూర్య ఖాతాలో మరొక మంచి చిత్రం చేరగా దర్శకురాలిగా సుధా కొంగర ప్రతిభ అందరికీ తెలిసింది. తమిళ సినీ ఇండస్ట్రీ గర్వించదగిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది. తాజాగా సినిమాకు మరొక గొప్ప గౌరవం దక్కింది. సినిమా ఆస్కార్​ రేసులో నిలిచింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ లాంటి కేటగిరీల్లో ఆస్కార్ బరికి ఎంపికైంది. అంతేకాదు అకాడమీ స్క్రీనింగ్​ రూమ్​లో మంగళవారం ఈ చిత్రాన్ని ప్రదర్శించారని కూడ సమాచారం. మొత్తానికి సినిమాకు మంచి గుర్తింపే లభిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు