కొత్త ప్రయోగం చేయనున్న సూర్య

Published on Mar 12, 2021 2:01 am IST

హీరో సూర్య సినిమాలు అంటేనే ఏదో ఒక కొత్తదనం ఆశిస్తారు ప్రేక్షకులు. సూర్య సైతం సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా చూసుకుంటారు. నటుడిగా ఎలాంటి పాత్రనైనా చేయగలదని పేరు తెచ్చుకున్నారు ఆయన. ఇటీవల ఆయన నుండి వచ్చిన ‘సూరరై పొట్రు’ చిత్రం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఓటీటీ ద్వారా విడుదలైనప్పటికీ జనాలకు గట్టిగా రీచ్ అయింది. ఆస్కార్ అవార్డుల బరిలో కూడ స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత సూర్య మూడు కొత్త సినిమాకు సైన్ చేశారు.

వాటిలో ఒక పిరియాడికల్ మూవీ కూడ ఉందట. వసంతబాలన్ ఈ సినిమాకు దర్శకుడు. ఆయన చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో సూర్య వెంటనే ఓకే చెప్పారని, ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. సూర్య ప్రజెంట్ పాండిరాజ్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నారు. అది ముగిశాక వెట్రి మారన్ చిత్రం ఉంటుంది. ఆ తర్వాత దర్శకుడు హరితో ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. ఇవన్నీ ముగిశాక వసంతబాలన్ సినిమా ఉండే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :