సందీప్ కిషన్ సినిమా టీజర్‌ను లాంచ్ చేయనున్న సూర్య!
Published on Aug 2, 2016 3:40 pm IST

suriya
తెలుగుతో పాటు తమిళంలోనూ పలు క్రేజీ సినిమాలు చేస్తూ హీరోగా ఓ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోన్న సందీప్ కిషన్, ప్రస్తుతం ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన హీరోగా నటించిన తమిళ సినిమా ‘మాయావన్’ తప్పకుండా సందీప్ కెరీర్‌కు మంచి బ్రేక్ ఇస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఈమధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన రాగా, ఈ సాయంత్రం 6 గంటలకు ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయనున్నారు. స్టార్ హీరో సూర్య ఈ టీజర్‌ను విడుదల చేయనుండడం విశేషంగా చెప్పుకోవాలి.

తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సీవీ రావు దర్శకుడిగా మారి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌తో కలిసి ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ ఓ పోలీసాఫీసర్‌గా నటిస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు. బ్రాన్, గోపీ అమర్‌నాథ్, లొయో జాన్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈ సినిమా సందీప్ కెరీర్లో భారీ బడ్జెట్ సినిమాగా ప్రచారం పొందుతోంది.

 
Like us on Facebook