సర్ప్రైజ్.. తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఛావా’

సర్ప్రైజ్.. తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఛావా’

Published on Apr 12, 2025 9:51 AM IST

ఇటీవల బాలీవుడ్ సినిమా డెలివర్ చేసిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో విలక్షణ నటుడు విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ లో దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ తెరకెక్కించిన చిత్రం “ఛావా” కూడా ఒకటి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై తెరకెక్కించిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.

అంతకు మించి ప్రస్తుత తరాన్ని ప్రభావితం కూడా చేసింది. ఇక అక్కడ రిలీజ్ అయ్యిన మొదటి రోజు నుంచే తెలుగులో కూడా ఈ సినిమాకి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇలా గీతా ఆర్ట్స్ వారు తెలుగు డబ్బింగ్ ని థియేటర్స్ లోకి తీసుకురాగా ఇక్కడ కూడా మంచి హిట్ అయ్యిన ఈ సినిమా జస్ట్ రీసెంట్ గానే ఓటిటిలో కూడా వచ్చింది.

దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ సినిమా మొదటి కేవలం హిందీలో మాత్రమే వచ్చి డిజప్పాయింట్ చేసింది. కానీ ఇపుడు మాత్రం ఫైనల్ గా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతూ సర్ప్రైజ్ ఇచ్చింది అని చెప్పాలి. నేటి నుంచి ఇదే నెట్ ఫ్లిక్స్ లో తెలుగు వెర్షన్ లో కూడా ఛావా స్ట్రీమింగ్ అవుతుంది. మరి అప్పుడు మిస్ అయ్యినవారు ఇపుడు ఈ సినిమాని చూడొచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు