సరికొత్త అవతార్ లో సూర్య…పుట్టిన రోజు బ్లాస్ట్ అదిరింది గా!

Published on Jul 22, 2021 7:18 pm IST

సన్ పిక్చర్స్ పతాకంపై కళానితి మారన్ సమర్పణ లో సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ విడుదల అయింది. సూర్య పుట్టిన సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ చిత్రం లో సూర్య చాలా డిఫెరెంట్ లుక్ లో ఉన్నారు. మాస్ లుక్ తో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. అయితే సూర్య 40 వ చిత్రం కి టైటిల్ గా ఎతర్కుం తునిండవన్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ మరియు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. యూ ట్యూబ్ లో విడుదల చేసిన గంటల్లో 473 కే వ్యూస్ మరియు 119కే లైక్స్ తో దూసుకు పోతుంది. అంతేకాక దీని పై చర్చలు సైతం జరుగుతున్నాయి.

అయితే పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంగీతం ఇమ్మన్ అందిస్తున్నారు. ఈ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :