ఫోటో మూమెంట్ : నీ జతగా నేనుంటా..!

ఫోటో మూమెంట్ : నీ జతగా నేనుంటా..!

Published on Apr 7, 2015 12:36 AM IST

surya-jyothika
ఒకరు తెలుగు, తమిళ భాషల్లో సూపర్ సక్సెస్ సినిమాలతో అద్భుతమైన హీరోగా పేరొందిన నటుడు సూర్య. మరొకరు విభిన్నమైన నటనతో తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన నటి జ్యోతిక. ఇద్దరూ సినిమాల్లో జంటగా నటించారు. ఆ తర్వాత నిజ జీవితంలోనూ పెళ్ళి అనే బంధంతో జంటగా మారారు. పెళ్ళైన తర్వాత జ్యోతిక దాదాపుగా ఏడేళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నారు.

మళ్ళీ ఇన్నేళ్ళకు ‘36 వయధినిలె’ (36 ఏళ్ల వయస్సులో) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు జ్యోతిక. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను చెన్నైలో ఈ ఉదయం నిర్వహించారు. ఈ సినిమాకు సూర్యయే నిర్మాత కావడం విశేషం. ఆడియో ఆవిష్కరణకు సూర్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగానే సూర్య, జ్యోతిక ఇలా అందంగా కెమెరాలకు చిక్కారు. ఒకే ఫ్రేములో రెండు నిండు చందమామలను అందంగా దింపినట్లుంది కదూ.. ఈ జంటను చూస్తోంటే..!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు