‘స్ప్రైట్’ బ్రాండ్ అంబాసడర్ గా యంగ్ హీరో !

Published on Feb 27, 2020 3:49 pm IST

అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నాన్ బాహుబలి రికార్డ్స్ ను బద్దలు కొట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. సుశాంత్ పాత్ర నిడివి తక్కువ ఉన్నా.. బన్నీతో పోల్చుకుంటే సుశాంత్ కు అంతగా ప్రాధాన్యత లేకపోయినా సుశాంత్ కు మాత్రం మంచి పేరే వచ్చింది. మొత్తానికి సుశాంత్ కెరీర్ ను బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు.

తాజాగా సుశాంత్ ‘స్ప్రైట్’తో కమర్షియల్ యాడ్స్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. సుశాంత్ ‘స్ప్రైట్’కు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా తాజాగా ఆ బ్రాండ్ కు ఆయన చేసిన మొదటి కమర్షియ యాడ్ విడుదలైంది. ఇక సుశాంత్ ప్రస్తుతం ఎస్.దర్శన్ దర్శకత్వంలో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’లో నటిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం కీలక పాత్రలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More