వెబ్ ఫిల్మ్ చేయనున్న చిరు కుమార్తె

Published on Apr 29, 2021 3:00 am IST

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి చాలామంది వారసులు హీరోలుగా వచ్చారు. మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక చిరు పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. తండ్రి చిరంజీవి, సోదరుడు రామ్ చరణ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన ఆమె ఇప్పుడు నిర్మాతగా మారే పనిలో ఉన్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్ఠహ్ను స్థాపించి ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్ నిర్మించిన ఆమె ఇప్పుడు వెబ్ ఫిలిం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

తమిళంలో హిట్టైన ‘8 తొట్టక్కల్’ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసే పనిలో ఉన్నారామె. 2017లో వచ్చిన ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్నే అందుకుంది. దీన్ని తెలుగులో పవన్ సాథినేని డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. ఇది గనుక విజయం సాధిస్తే సుస్మిత కొణిదెల పూర్తిస్థాయి నిర్మాతగా మారి వెండి తెర సినిమాలను నిర్మించాలానే ఆలోచనలో ఉన్నారు.

సంబంధిత సమాచారం :